2020 జనవరిలో అత్యధిక బ్యాంకు సెలవులు

Bank holidays
Bank holidays

న్యూఢిల్లీ: 2020 జనవరి నెలలో బ్యాంకు ఉద్యోగులకు ఎక్కువ సెలవులు ఉన్నాయి. బ్యాంకులతో పనులు ఉన్న కస్టమర్లు ఆయా బ్యాంకుల సెలవు రోజులను చూసుకొని, బ్యాంకులను సందర్శించడం మంచిది. 2020లో మొదటి నెలలోనే బ్యాంకులకు దాదాపు 16 సెలవులు ఉన్నాయి. ఇందులో సాధారణ సెలవులతో పాటు ఇతర సెలవులు ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాలు, బ్యాంకులను బట్టి సెలవులు తగ్గుతాయి. మొత్తంగా ఎక్కువ బ్యాంకులకు దాదాపు 10 రోజులకు పైగా సెలవు రోజులు ఉన్నాయి. బ్యాంకులు ఆదివారాలు, అలాగే, రెండో, నాలుగో శనివారం క్లోజ్ అవుతాయి. జనవరిలో 4 ఆదివారాలు, రెండు శనివారాలు క్లోజ్ అవుతాయి. వివిధ పండుగలకు కూడా సెలవులు ఉంటాయి.

january-2020 holidays
january-2020 holidays

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/