ఎన్‌డిఎకి 283, టైమ్స్‌ నౌ ఒపీనియన్‌ పోల్‌

bjp
bjp


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ మీడియా సంస్థలు సర్వేలు చేయడం పరిపాటే. ఆ సర్వేలో భాగంగానే తాజాగా టైమ్స్‌ నౌ-విఎమ్‌ ఆర్‌ సంయుక్తంగా ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో బిజెపి ఢంకా బజాయించడం ఖాయం అని, మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్‌డిఎ 283 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని, యుపిఎ 135 స్థానాలు, ఇతరులు 125 గెలుచుకుంటారని తేల్చి చెప్పింది.

telangana
telangana


ఐతే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి 3 సీట్లు, వైఎస్‌ఆర్‌సిపికి 22 సీట్లు వస్తాయని, తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు 13 సీట్లు, బిజెపికి 2 సీట్లు ,కాంగ్రెస్‌కు 1 సీట్లు వస్తాయని టైమ్స్‌ నౌ తేల్చి చెప్పింది. కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగాను బిజెపి 15 సీట్లు, కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుచుకుంటారని అంచనాలు వేసింది.

andhra pradesh
andhra pradesh
karnataka
karnataka

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/