శివసేనలో చేరిని ఎన్‌సీపీ అగ్రనేత సచిన్‌ అహిర్‌

అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్‌సీసీకి ఎదురు దెబ్బ

NCP's Sachin Ahir, Shiv Sena
NCP’s Sachin Ahir, Shiv Sena party

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) చెందిన అగ్రనేత సచిన్‌ అహిర్ ఈరోజు శివసేనలో చేరారు.ముంబయి ఎన్‌సీపీ చీఫ్ అయిన సచిన్‌.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఆధ్వర్యంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సచిన్‌ మీడియాతో మాట్లాడుతు రాజకీయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. కాగా ఈ పరిణామంతో ముంబయిలోని వర్లి ప్రాంతంలో ఎన్‌సీపీ బలహీనం కానుంది. గతంలో ఆయన శివసేన బలమైన ప్రత్యర్థిగా ఉండేవారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/