బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ 2 కు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు తన స్నేహితుడు గోపీచంద్ సైతం హాజరై సందడి చేసారు. దీనికి సంబదించిన ఫస్ట్ గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.

ప్రభాస్ చాలా సింపుల్ గా షోలోకి అడుగు పెట్టి అందరికీ హాయ్ డార్లింగ్ అంటూ వచ్చాడు. బాలకృష్ణను కౌగిలించుకొని నవ్వుతూ స్మైల్ ఇచ్చాడు. ఇక ఈ తర్వాత ఈ షోలో బాలయ్యతో ఆట మొదలైన తర్వాత ప్రభాస్ సిగ్గుపడుతూ మాట్లాడిన విధానం వీడియో లో హైలెట్ గా కనిపిస్తుంది. ఇక గోపీచంద్ తో అతను సరదాగా మాట్లాడిన మాటలను కూడా చూపించారు. ‘రేయ్ ఏం చెప్తున్నావు డార్లింగ్’ అంటూ గోపీచంద్ ఏదో అన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా బాలయ్య ఏదో చేస్తూ ఉంటే ప్రభాస్ దూరం దూరంగా వెళుతూ ఉన్నాడు. ఇక గోపీచంద్ కూడా ప్రభాస్ కు సంబంధించి ఏదో విషయం చెబుతూ ఉంటే ప్రభాస్ అలిగినట్లుగా కనిపించింది. మొత్తానికి ఫస్ట్ గ్లింప్స్ ఎపిసోడ్ ఫై మరింత ఆసక్తి పెంచింది.

YouTube video