‘నాయిని’ కన్నుమూత
కుటుంబ సభ్యుల కు సియం కెసిఆర్ పరామర్శ

Hyderabad: రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి(80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు.
తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన అర్ధరాత్రి 12.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు జూబ్లీహిల్స్ లోని అపోలో అసుపత్రి వర్గాలు ప్రకటించాయి.
సెప్టెంబరు 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.
అయినా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఒక్కసారిగా పడిపోయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యుమోనియా సోకినట్లు తేల్చారు.
మెరుగైన వైద్యం కోసం ఈ నెల 13న ఆయనను కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. బుధవారం ఆయన పరిస్థితి విషమించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లి, నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డిని ఓదార్చారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/