త్వరలో నిశ్చితార్థం చేసుకోనున్న నయనతార!

Vignesh Shivan, Nayanthara
Vignesh Shivan, Nayanthara

చెన్నై: ప్రముఖ నటి నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు ఇప్పుడు ఈ ఈ ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020లో నయన్, విఘ్నేశ్‌ ఓ ఇంటివారు అవుతారు. 2015లో ఖనానుమ్‌ రౌడీదాన్గ అనే చిత్రం ద్వారా నయన్‌, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. ఈ సినిమాకు విఘ్నేశ్‌ దర్శకత్వం వహించగా.. నయన్‌ కథానాయికగా నటించారు. ఆ పరిచయం కాస్తా స్నేహానికి దారి తీసి ప్రేమగా మారింది. అప్పటినుంచి నయన్‌, విఘ్నేశ్‌ జంటగా విహారయాత్రలకు వెళుతున్నారు.


మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/