నక్సల్స్‌ దుశ్చర్య, 27 వాహనాలకు నిప్పు

vehicles
vehicles

ముంబై: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో నక్సల్స్‌ వాహనాలను దగ్ధం చేశారు. రహదారి నిర్మాణ పనులకు సంబందించిన 27 వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టారు. దీంతో ఆ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. 27 వాహనాలకు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు కాంట్రాక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఏడాది జనవరిలో కూడా కుర్ఖేడాలో పలు వాహనాలకు నక్సల్స్‌ నిప్పు పెట్టారు. ఏప్రిల్‌ 11వ తేదీన గడ్చిరోలిలో సిఆర్పీఎఫ్‌ బలగాలు, నక్సల్స్‌కు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/