ఝార్ఖండ్‌లో నక్సల్స్‌ ఘాతుకం

jharkhand election
jharkhand election

రాంచీ: ఝార్ఖండ్‌లో ఈ రోజు ఉదయం 7గంటలకు తొలి విడత పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ జరుగుతున్న గుల్మా జిల్లాలోని విష్ణుపూర్‌లో నక్సల్స్‌ ఓ వంతెనను పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోలీసు ఉన్నతాధికారి శశి రంజన్‌ తెలిపారు. పోలింగ్‌కు కూడా ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటకి పెలుడు సంభవించడంతో పోలీసు బలగాలు మరింత అలర్ట్‌ అయ్యారు. నక్సల్స్‌ నుంచి ఎటువంటి ఘతుకాలు జరగకుండా పోలింగ్‌ కేంద్రాల చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఝార్ఖండ్‌లో ఎన్నికలు మొత్తం ఆరు జిల్లాలలోని 13 నియోజకవర్గాలలో ఈ రోజు పోలింగ్‌ కొనసాగుతుంది. ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నట్లు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/