ఎంపీ నవనీత్‌ రాణాకు బెదిరింపులు

mp-navneet-kaur-visits-tirumala

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్‌ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మహారాష్ట్రకు రానివ్వను.. హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తే చంపేస్తా.. ఓ నంబర్‌ నుంచి తనకు 11 సార్లు కాల్‌ వచ్చింది’ అని పేర్కొన్నారు. బెదిరింపులతో తాను భయాందోళనకు గురయ్యాయనని ఢిల్లీ నార్త్‌ అవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడ్డ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నవనీత్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, . స్వతంత్ర ఎంపీ నవనీత్‌ రాణా, శివసేన మధ్య గతకొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నవనీత్‌ రాణాతో పాటు ఆమె భర్త రవి రాణా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలీసా పారాయణం చేయనున్నట్లు ప్రకటించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: