కపిల్‌ శర్మ షో నుండి సిద్దూ తొలగింపు

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

న్యూఢిల్లీ: పుల్వామా దాడిపై నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మీడియాతో మాట్లాడుతూ.. జమ్ము, కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, అదొక పిరికి పందల చర్యగా అభివర్ణించారు. హింస ఎక్కడ చెలరేగినా వ్యతిరేకించాలని, దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఇదే సందర్భంలో కొంతమంది చేసిన తప్పునకు దేశం మొత్తాన్ని నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సిద్ధూపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందులో కొందరు కపిల్‌ శర్మ షో నుంచి సిద్ధూను తొలగించాలనే డిమాండ్‌ చేశారు. దీంతో హాస్యనటుడు కపిల్‌శర్మ సారథ్యంలో నిర్వహించే టీవీ షో ఖది కపిల్‌ శర్మ షోగ నుంచి మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూను తప్పించారు.సిద్ధూ వ్యాఖ్యల నేపథ్యంలో టీవీషో కూడా అనవసర వివాదంలో చిక్కుకుంటుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకొన్నారు.