జమిలి ఎన్నికలను సమర్ధించిన ఒడిశా సియం

న్యూఢిల్లీ: ప్రధాని మోది నేతృత్వంలో బుధవారం న్యూఢిల్లీలో జమిలి ఎన్నికల కోసం జరిగిన సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు హాజరయ్యారు. మరికొంత మంది గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరైన వారు జమిలి ఎన్నికలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కాగా ఒడిశా సియం, బిజు జనతాదళ్ అధినేత, నవీన్ పట్నాయక్ జమిలి ఎన్నికలను సమర్ధించారు. దేశంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించేందుకు జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
నవీన్ పట్నాయక్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. తరుచు ఎన్నికలు జరగడం వల్ల దేశంలో శాంతియుత వాతావరణం దెబ్బతింటుంది. ఇది సమాఖ్య స్పూర్తిని కూడా దెబ్బ తీస్తుంది. ఒకే దేశం..ఒకే ఎన్నికను బిజెడి పూర్తిగా సమర్ధిస్తుందని అన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/