తెరపైకి ఒడిశాకు ప్రత్యేక హోదా అంశం!

naveen patnaik
naveen patnaik

న్యూఢిల్లీ: ఒడిశా సియం, బీజూ జనతాదళ్‌ అధ్యక్షులు నవీన్‌ పట్నాయక్‌ దేశ ప్రధాని నరేంద్ర మోదితో భేటీ అయ్యారు. మోదీతో సమావేశం అనంతరం నవీన్‌ పట్నాయక్‌ మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మోదికి శుభాకాంక్షలు తెలిపినట్లు చెప్పారు. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. ఇటీవల ఫ‌ణి తుఫాను ధాటికి ఒడిశా తీవ్రంగా నష్టపోయిందని ,న‌ష్ట ప‌రిహారం కింద రూ. 5000 కోట్లు ఇప్పించ‌మ‌ని నవీన్‌ పట్నాయక్‌ పేర్కొన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos