చిన్న శేషవాహనంపై మలయప్ప స్వామి

వైభవోపేతంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

navaratri-brahmotsavalu-in-tirumala

తిరుమల: తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. ఈరోజు ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారుల సమక్షంలో పెద్దశేష వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు డిపి అనంత‌, వేమిరెడ్డి ప్ర‌శాంతి, చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, గోవింద‌హ‌రి ఇత‌ర అధికారులు పాల్గొన‌నున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/