నాటు బాంబులు పేలి ఏడుగురికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

natu bomb blast
natu bomb blast

ఎచ్చెర్ల: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయితీ పరిధిలోని యాటపేట గ్రామంలో నాటు బాంబులు పేలిన ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం ప్రకారం ..యాటపేటలో గుర్తు తెలియని వ్యక్తులు అద్దెకు దిగి నాటు బాంబులు తయారు చేస్తున్నారు. అడవి పందులను వేటాడేందుకు వారు నాటు బాంబులను వాడుతున్నారు. అవి ఒక్కసారిగా పేలి ఏడుగురు గాయపడ్డారు. వెంటనే వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడుకు ఇల్లు కూడా పాక్షికంగా ధ్వంసమైంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/