కొలంబస్ లో నాట్స్ వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు

Detroit, Columbus Team members
Detroit, Columbus Team members

కొలంబస్‌: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసే దిశగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కొలంబస్ నాట్స్ సెంట్రల్ ఓహియో విభాగం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మహిళల త్రోబాల్ పోటీల్లో తెలుగువనితలు తమ సత్తా చూపారు. డెట్రాయిట్, కొలంబస్ టీమ్ ల మధ్య జరిగిన త్రో బాల్ ఫైనల్ పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మహిళలు ఆద్యంతం గెలుపు కోసం పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. చివరకి ఫైనల్ లో కొలంబస్ టీంపై డెట్రాయిట్ టీం విజయం సాధించింది..తెలుగు మహిళల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని నాట్స్ తెలిపింది. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/