నేడు జాతీయ యువజనోత్సవం

 

National Youth Day 2019
National Youth Day 2019

మేడ్చల్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేడు జిల్లా పరిధిలోని శామీర్ మండలం దేవరయాంజాల్ గ్రామంలో జాతీయ యువజనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి బీ బలరాం రావు పేర్కొన్నారు. ఉదయం 11 గంట లకు ఓటరు నమోదు కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి పాల్గొంటారని అన్నారు.