హైదరాబాద్‌ పోలీసులపై మాయావతి ప్రశంసలు

హైదరాబాద్ పోలీసులను చూసి యూపీ పోలీసులు నేర్చుకోవాలి

MAYAVATHI
MAYAVATHI

ఉత్తరప్రదేశ్‌: దిశ హత్యాచార కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి సమర్థించారు. అలాగే, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు గుప్పించారు. తమ రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నప్పటికీ సర్కారు నిద్రపోతోందని అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘ఉత్తరప్రదేశ్ లో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుండా నిద్రపోతోంది. హైదరాబాద్ పోలీసులను చూసి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ పోలీసులు నేర్చుకోవాలి. కానీ, ఇక్కడ దురదృష్టవశాత్తూ నేరగాళ్లను అతిథులుగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో జంగల్ రాజ్ కొనసాగుతోంది’ అని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/