ఏపి సర్కార్కు 100 కోట్ల జరిమానా

అమరావతి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపి ప్రభుత్వానికి రూ.100కోట్లు జరిమానా విధించింది. అయితే ఏపి సిఎం చంద్రబాబు నివాసం దగ్గరలో కృష్ణా నది వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. కాగా రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీకి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/