‘మహానటి’కి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు

66వ జాతీయ అవార్డుల ప్రకటన

Mahanati
Mahanati

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా ”మహానటి”కి అవార్డు దక్కింది. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ టైటిల్‌రోల్‌ పోషించారు. సమంత, విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది. కాగా ఈ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/