జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం

ఈ నెల 10వ తేదీ..  1 నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలు గల తల్లిదండ్రులకు.. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరిన ప్రభుత్వం

National Deworming Day
National Deworming Day

హైదరాబాద్‌: తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తొమ్మిదవ విడత జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని (నేషనల్ డీవార్మింగ్ డే) ను ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 17న ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, ప్రాథమిక విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డ్, బోర్ట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, మహిళా, శిశు సంక్షేమ శాఖలు పాలుపంచుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, మదరసాలు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అంగన్ వాడి సెంట్లర్లను కవర్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒకటి నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలకు నులిపురుగులను నివారించే మందులను అందజేయనున్నారు. కాగా పిల్లల ఆరోగ్యానికి డీవార్మింగ్ అనేది చాలా ముఖ్యమైనది. నులిపురుగుల వల్ల పిల్లలకు అనేక అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు వారిలో నులిపురుగులు ఉంటే వారిలో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులందరూ తమ పిల్లల కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కోరింది.

తాజా బడ్జెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/budget/