రాజధానికి చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ కమిటీ

అమరావతి: ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న ఆందోళనల్లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్దారణ కమిటీ ఆదివారం చేరుకుంది. పోలీసులు తమపై అనుసరించిన తీరును మహిళా రైతులు కమిటీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వీడియోలు, ఫోటోలను కమిషన్‌కు అందచేయనున్నారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేయనున్నారు. మందడంలో మహిళల మీద దాడి ఘటనపై కూడా మహిళా రైతులు ఫిర్యాదు చేయనున్నారు. మహిళా రైతులను అరెస్టు చేసిన పోలీసులు మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కలకలం రేపింది. రాత్రి అవుతున్నా విడిచిపెట్టకపోవడంతో మహిళలు ఆందోళన చెందారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్ట్‌లు చేశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై దర్యాప్తుకు నిజనిర్దారణ కమిటీ రాబోతోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/