షెడ్యూల్‌కు సింధు అలవాటు పడాలి

బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌

pullela gopichand and pv sindhu
pullela gopichand and pv sindhu

కోల్‌కతా: వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్‌) నిర్దేశించిన షెడ్యూల్‌ కష్టంగానే ఉన్నప్పటికీ సింధు దానికి అలవాటు చేసుకోవాలి నేషనల్ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ సూచించారు. కోల్‌కతాలో జరిగిన ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌’ పుస్తకాన్ని ఈ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ వ్యూహాలు, బీడబ్ల్యూ ఎప్ షెడ్యూల్‌పై మాట్లాడారు. బిజీ షెడ్యూల్‌ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు ఈ సమస్య ను ఎదుర్కొంటున్నారు. ఒక టాప్‌లెవెల్ షట్లర్‌గా ఈ షెడ్యూల్‌కు అలవాటు పడటం సింధు బాధ్యత. ఈ పరిస్థితికి ఆమె అలవాటు పడాలి. ఒలింపిక్స్‌ ముందు సింధు తన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ఉంది. త్వరలోనే మా బలహీనతలపు అధిగమిస్తాం. కోచ్‌ తు సంగ్‌ పార్క్, ట్రెయినర్‌ శ్రీకాంత్‌లతో కూడిన మా టీమ్‌ దానిపైనే పని చేస్తోంది. సింధు కచ్చితంగా టోక్యో’లో పతకం సాధిస్తుంది. మంచి ప్రిపరేషన్‌తో సింధు బరిలోకి దిగుతుంది. ఒలింపిక్స్‌కు ముందు ఇంకా ఏడు టోర్నీలున్నాయి. సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ అర్హతకు సరిహద్దుల్లో ఉన్నారు. రాబోయే టోర్నీల్లో వారు రాణించాలి అని గోపిచంద్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/