దేశానికి,జాతికి ఎన్నటికి తలవంపులు తేను

చురు: ప్రధాని నరేంద్రమోడి రాజస్ధాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగా సభలో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడినిప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు.దేశం మేల్కొని ఉందని.. ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ భారతావని తల ఎత్తుకునే ఉంటుంది. ఈ దేశ గౌరవ మర్యాదలను మంటకలిపే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. జాతి ప్రయాణం ఆగదు.. ఈ జాతి విజయయాత్ర కొనసాగుతూనే ఉంటుంది. జాతి నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ప్రధాన సేవకుడిలా నమస్కరిస్తున్నా. ఓఆర్‌ఓపీ కింద మాజీ సైనికులకు రూ.35వేల కోట్లు అందించాం. అని మోడి అన్నారు.