చరిత్ర సృష్టించిన నథానియా

NATHANIAYA
NATHANIAYA

చరిత్ర సృష్టించిన నథానియా

మాస్కో: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్‌లో భారత బాలిక నథానియా జాన్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అధికారిక మ్యాచ్‌ బాల్‌ క్యారియర్‌ (ఓఎంబిసి)గా వ్యవహరించిన తొలి భారత బాలికగా నథానియా చరిత్ర సృష్టించింది. ఫిఫా కప్‌లో భాగంగా శుక్రవారం సెయింట్‌ పీటర్గ్‌బర్గ్‌లో బ్రెజిల్‌-కోస్టారికా జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌కు నథానియా బాల్‌గర్ల్‌గా వ్యవహరించింది.

మాజీ ఛాంపియన్‌, రష్యాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో టైటిల్‌ రేసులో ఒకటిగా ఉన్న బ్రెజి ల్‌ను సగర్వంగా మైదానంలోకి తోడ్కొని వచ్చింది. తమిళనాడులోని నీలగిరికి చెందిన నథానియాకు ఫుట్‌బాల్‌ ఆట అంటే ఎంతో ఇష్టం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోగల రిషి వ్యాలీ స్కూల్‌లో ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 64మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకు న్నారు.భారత్‌లో ఫిఫా స్పాన్సర్‌ కియా మెటార్స్‌ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో నెగ్గిన నథానియా ఈ గౌరవం దక్కించుకుంది. ఆమెతోపాటు కర్ణాటకకు చెందిన 10ఏళ్ల రిషీ తేజ్‌ కూడా బాల్‌బా§్‌ుగా ఎంపికయ్యాడు.

భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి ట్రయల్స్‌ నిర్వహించి వీరిని ఎంపిక చేశాడు. తనకు దక్కిన గౌరవంపై నథానియా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నథాని యా మాట్లాడుతూ నా అభిమాన ఆటగాడైన నె§్‌ుమార్‌ను కలిసే అవకాశం దక్కింది. నె§్‌ు మార్‌ బార్సిలోనా ఆటగాడు కౌంటిన్లో తదితర ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌లు తీసుకుంటా. మ్యాచ్‌ కోసం మెస్సీ సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్లాడు. మెస్సీని కలిసే అవకాశం దక్కకపోవచ్చు.

అదృష్టం బాగుండి నేను ఒకవేళ అతడ్ని కలిస్తే ఆ ఆనందాన్ని మాట ల్లో చెప్పలేను. ఈ గౌరవానికి ఎంపి కవుతానని ముందు నుంచీ తాను విశ్వాసంతో ఉన్నా. ప్రపంచకప్‌లో తనను చూశాకైనా భారత్‌లో ఎంతోమంది బాలికలు ఫుట్‌బాల్‌లోకి వస్తారని నథానియా విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే టోర్నీలో భాగంగా గత సోమవారం బెల్జియం-పనామా మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు కర్ణాటకకు చెందిన పదేళ్ల రిషి తేజ్‌ అధికారిక బంతిని మైదానంలో తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. =====