కరోనాపై పోరుకు నాట్కో భారీ విరాళం

కృతజ్ఞతలు తెలిపిన కెటిఆర్‌

 ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణ చర్యలకు మద్దతుగా నాట్కో ఫార్మా లిమిటెడ్‌ తమ వంతు సాయం ప్రకటించింది.రూ.2.50 కోట్లు విలువ చేసే, వైద్య బృందాలకు అవసరమయ్యే పర్సనల్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్‌ (పిపిఈ)లను , రూ.1.50 కోట్లు విలువ చేసే మందులు, పరికరాలను విరాళంగా అందజేసింది. ఈ విరాళంపై స్పందించిన మంత్రి కెటిఆర్‌ నాట్కో కంపెనికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ -19 పై పోరాటానికి మీరు చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/