సన్‌రైజర్స్‌ జట్టులో కరోనా కలకలం

సన్‌రైజర్స్‌ జట్టులో కరోనా కలకలం సృష్టించింది. జట్టు ఆటగాడు నటరాజన్‌ కరోనా బారినపడ్డాడు. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురుని ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. వారిలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, మేనేజర్‌ విజయ్‌ కుమార్‌, ఫిజియోథెరపిస్ట్‌ శ్యామ్‌ సుందర్‌, డాక్టర్‌ అంజనా వన్నన్‌, లాజిస్టిక్‌ మేనేజర్‌ తుషార్‌ ఖేడ్కర్‌, నెట్‌ బౌలర్‌ పెరియసామి గణేశన్‌ లు ఉన్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌ మాసంలో జరగాల్సిన ఐపీఎల్‌ 2021 టోర్నీ వాయిదా పడింది. కరోనా తగ్గిన నేపథ్యం లో దుబాయ్‌ లో పునః ప్రారంభం అయిన ఈ ఐపీఎల్‌ 2021 టోర్నీ ని… ఇక్కడి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇక ఈరోజు సాయంత్రం 7.30 ఢిల్లీ కాపిటల్స్‌ మరియు సన్‌ రైజర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. జట్టులోని మిగిలిన ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి ఈ రోజు ఉదయం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. వాటిలో అందరికీ నెగిటివ్‌ వచ్చిందట. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ (సన్‌రైజర్‌ vs దిల్లీ కేపిటల్స్‌) యథావిధిగా కొనసాగుతుందని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.