సెయింట్ లూయీస్‌లో నాటా డే వేడుక‌లు

NATA
NATA

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో జూలైలో ఫిలడెల్ఫియాలో నిర్వహించే మెగా కన్వెన్షన్‌లో భాగంగా సెయింట్‌ లూయిస్‌లో మెగా నాటా డే వేడుకలను నిర్వహించారు. సెయింట్‌ లూయిస్‌లోని మహాత్మాగాంధీ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 700 మందికిపైగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో 160 మంది కళాకారులు ఆటా, పాటలతో అతిథులను అలరించారు. చెస్‌, మాథ్స్‌ పోటీల్లో120 మంది చిన్నారులు హుషారుగా పాల్గొన్నారు. ఈ కల్చరల్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కళాకారులందరికి నిర్వాహుకలు ట్రోపీలను అందజేశారు.