మందగమనంలోను సాఫ్టువేర్‌ అదుర్స్‌

టెక్‌ ఇండస్ట్రీ 2 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించింది

software employees
software employees

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలోను టెక్‌ ఇండస్ట్రీ 2 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించిందని నాస్‌కాం ప్రశంసించింది. మార్చి, 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ఇండియా టెక్నాలజీ సెక్టార్‌ వృద్ధి రేటు 7.7 శాతం పెరిగి 191 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచానా వేసింది. గత ఏడాది 8.1 శాతం వృద్ధి రేటు కాగా, మందగమనం నేపథ్యంలో ఇప్పుడు స్వల్పంగా తగ్గనుంది. మందగమనం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం వృద్ధి పథంలో సాగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ రంగంలో 2.05 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించింది. దీంతో దేశ ఐటీ, బీపీఓ రంగంలో పని చేస్తోన్న ఉద్యోగుల సంఖ్య 43.6 లక్షలకు చేరుకుందని జాతీయ చైర్మన్‌ కేశవ్‌ ముగుగేష్‌ చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/