ఢిల్లీ కాలుష్యంపై హెచ్చరించిన నాసా

delhi pollution
delhi pollution

న్యూఢిల్లీ: దీపావళి అంటేనే బాణాసంచా. పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచాతో వెలువడే పొగ, కాలిన చెత్త ఉండటం సర్వ సాధారణమే. దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అందుకు తోడు ఢిల్లీలో బాణసంచాతో వాయుకాలుష్యం, చెత్త మరింత పెరిగి అక్కడ వాతావరణం పూర్తిగా కలుషితమైపోతున్నది. ఈ పరిస్థితిని శాటిలైట్ల ద్వారా గమినంచిన అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొల్యూషన్‌ ఒక్కసారిగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. దాంతో అప్రమత్తమైన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో జరుగుతున్న భవన నిర్మాణాలన్నీ ఆపేయాలని, చుట్టుపక్కల రాష్ట్రాలేవైనా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తున్నారా అని నిఘా పెట్టారు. ముఖ్యంగా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో బాణసంచా వెలుగులప దృష్టి సారించారు. గతేడాది పంజాబ్‌, హర్యానాలో 5,414 చోట్ల బాణసంచా కాల్చారు. ఈ ఏడాది అది మరి కాస్త పెరిగేలా ఉంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలోని కోతకు వచ్చిన పంటలను కోసి మిగిలిన చెత్తను తగులబెడుతున్నారు. ఇది అక్టోబర్‌ మధ్యలో మొదలై నవంబర్‌ మధ్య వరకూ కొనసాగుతుంది. ఈ యేడాది కూడా అదే జరుగుతోంది. పంటలు తగులబెట్టడాన్ని ఆపేందుకు ఉన్న అన్ని అవకాశాలను అమల్లోకి తేవాలని పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాల్ని ప్రధాన మంత్రి కార్యాలయం కోరింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/