‘కరోనా వ్యాధి నివారణ చర్యలు ముమ్మరం’

నర్సాపురం ఎం ఎల్ ఏ ప్రసాదరాజు ఆదేశం

MLA Prasada Raju

Narsapuram: కరోనా వ్యాధి నివారణ చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మల్యే ముదునూరి ప్రసాదరాజు అధికారులను ఆదేశించారు.

మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం కరోనా విపత్తు పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

పారిశుధ్య పనులు, తాగునీరు సరఫరా, వైద్య సహాయం తదితర అంశాల పై చర్చించారు. ఆయా శాఖ ల పనితీరు ను అడిగి తెలుసుకున్నారు.

ఆలాగే అధికారులంతా సమన్వయంగా పనిచేసి కరోనా కట్టడి కి చేపట్టాల్సిన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.

కరోనా వ్యాధి నివారణ కు సంబంధించి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో బ్లీచింగ్, పాగింగ్ సోడియం హైపో క్లోరైడ్ వంటి క్రిమిసంహారక మందులు చల్లాలని శానిటేషన్ చర్యలు నిత్యం చేయాలని సూచించారు.

ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సేవలను అందించడానికి ఉన్నామని. దానికనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.

సబ్ కలెక్టర్ కే ఎస్ విశ్వనాథన్, డిఎస్పీ కే నాగేశ్వరరావు, సీ ఐ కృష్ణ కుమార్, ఎంపీడీఓ లు , తహశీల్దార్లు, వైద్య సిబ్బంది , మున్సిపల్ సిబ్బంది తో బాటు వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com