మంచు విష్ణు కు మద్దతు తెలిపిన నరేష్

మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో చిత్రసీమ లో వేడి ఎక్కువతుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అక్టోబర్ 10 న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటుడు నరేష్ తన మద్దతు ను మంచు విష్ణు ప్యానెల్ కు ఇస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష పదవి పోటీలో ఉన్న మంచు విష్ణుతో కలిసి బుధవారం హైదరాబాద్​లో ప్రెస్​మీట్​ పెట్టారు. ఓ మంచి వారసుడిని ఇవ్వడం తన బాధ్యత అని నరేశ్ అన్నారు. గతంలో ‘మా’ మసకబారిందని అంటూ వచ్చిన ఆరోపణలుపై నరేశ్ స్పందించారు. తన హయాంలో ‘మా’ అభివృద్ధి చెందిందని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి పనులను వివరించారు. అత్యధిక ఓట్లతో తాను గెలిచినట్లు గుర్తుచేశారు.

నేను వెల్ ఫేర్ కమిటీ చైర్మన్ గా వున్నప్పుడు ఆరు నెలల పాటు సర్వే చేసి అవకాశాలు కలిపించాం. వెల్ ఫేర్ కమిటీని విజయవంతగా నిర్వహించమని నరేష్ తెలిపారు. పదవి వ్యామోహాలు ‘మా’లో వుండకూడదన్నారు నరేష్. పెద్దలు మంచి మైక్ లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి అన్న మాటలకు నేను నా నోటికి తాళం వేసి కూర్చున్నాను. ఒక పదకొండు మంది మీడియా ముందుకు వెళ్ళి జరగనిది చెయ్యలేనివి అబద్ధాలు చెప్పుకొచ్చారు. కరోనా టైంలో మా శాయశక్తుల సభ్యులకు సేవ చేసాము. రెండు సంవత్సరాలు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పనులు చేసాము. ఈ మూడు ఏళ్లలో ‘మా’ ముందుకు పోయింది కానీ మసక బారాలేదని నరేష్ కామెంట్స్ చేశారు.

మా’ భవనం కోసం ప్రయత్నం చేశా. దానికి సంబంధించిన ఆధారాలున్నాయి. నా తర్వాత ‘మా’కు మంచి అధ్యక్షుడిని అందించడం నా బాధ్యత. పదవి చేపట్టినప్పుడే ఈ విషయం చెప్పాను. ఈ కుర్చీలోకి ఎవరు పడితే వారు వస్తే ‘మా’ వైభవం కోల్పోతుంది. ప్రకాశ్‌ రాజ్‌ నాకు మంచి స్నేహితుడు. మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటారు. ‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు. నాది కృష్ణుని పాత్ర. ‘మా’ కోసం మంచు విష్ణు రథం ఎక్కుతున్నాను. నేను ఇప్పట్లో మళ్లీ పోటీ చేయను అని నరేష్ చెప్పుకొచ్చారు.