తల్లి అస్థికలను గోదావరిలో కలిపిన నరేశ్‌

Vijaya Nirmala – Naresh
Vijaya Nirmala – Naresh

హైదరాబాద్‌: ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల ఇటివల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నిర్మల ఆస్థికలను ఆయన కుమారుడు నరేశ్‌ గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. రాజమంద్రవరం కోటిలింగాల ఘాట్‌ వద్ద ఈరోజు శాస్త్రోకంగా పూజలు నిర్వహించి. తరువాత అస్థికలను గోదావరిలో కలిపారు. ఈ సందర్భంగా నరేశ్‌ మాట్లాడుతూ.. తన తల్లి నేర్పించిన క్రమశిక్షణ, వ్యక్తిత్వం వల్లే తాను మంచి నటుడిగా పేరుతెచ్చుకొనేందుకు దోహదం చేసిందని గుర్తుచేసుకున్నారు. నరేశ్‌ వెంట నటుడు గౌతంరాజు, తదితరులు ఉన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/