మోది తిరుమల పర్యటనకు బందోబస్తు ఏర్పాట్లు

narendra modi
narendra modi

అమరావతి: ప్రధాని నరేంద్ర మోది ఈ నెల 9న తిరుమలకు విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదికి ఏపి సియం స్వాగతం పలకనున్నారు. మోది తిరుమలకు రాక నేపథ్యంలో టిటిడి అధికారులు, పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మోది ప్రమాణ స్వీకారోత్సవానికి జగన్‌ కొన్ని సాంకేతిక కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. కాని ఈ నెల 15వ తేదీన మోది అధ్యక్షతన జరగబోయే నీతి ఆయోగ్‌ సమావేశానికి జగన్‌ హాజరు కానున్నారని సమాచారం. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సియంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/