తెలుసుకోండి .. నారాయణ తీర్థులు

Narayana Teertha
Narayana Teertha

చిన్నవయసులోనే సన్యాసిగా మారిన గోవిందశాస్త్రినే నారాయణ తీర్థులు. కూచిపూడి నాట్యానికి మూలపురుషుడైన సిద్ధేంద్రుని గురువ్ఞ ఈ నారాయణ తీర్థులు. ఏక వాక్యమున నిర్గుణములు బోధించు ధీశక్తి శంకరుని తర్వాత నారాయణ తీర్థులకే ఉందని కాశీ పండితులు నారాయణ తీర్థులను ప్రశంసించారు. ఆంధ్ర మహేశ్వర తీర్థులు, కాశ్మీర సదానందకవి, గీత బ్రహ్మానంద వంటి ఉద్దండ పండితులకే ఈయన గురువ్ఞగా ఉండేవారు. నారాయణ తీర్థులు కాశీ నుండి తీర్థయాత్రలకు బయలుదేరి తీర్ణాల మహత్యాలను తెలుపుతూ అనేక గ్రంథాలు రాశాడు. వాటిలో రామనామ సదృశము గంగగా, కృష్ణ నామ సదృశము, యము నగా, అంతర్వా హినియైన సరస్వతి గోవింద నామంగా స్ఫురింపచేస్తూ రాసిన రామకృష్ణ గోవిందేతి, నామ సంప్రయోణీ అనే గ్రంథం, శ్రీకృష్ణలీలా తరంగిణి పేరుతో రాసిన యక్షగాన గ్రంథం ప్రసిద్ధమైనవి. నారాయణ తీర్థులు తిరునందుర్తి నది సమీపంలో ఉన్న మామిడిచెట్టు క్రింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు. శిష్యులకు జ్ఞానభిక్ష పెట్టి జ్ఞాన భాస్కరుడిగా పేరు పొందాడు. 1745వ సంవత్సరంలో ఆ రసాల వృక్షం క్రిందనే సిద్ధిపొందాడు. శిష్యులు నారాయణతీర్థులకు సమాధిని కట్టించి, నిత్యం పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/