ఏపీలో రామరాజ్యాన్ని తెచ్చుకుందాం అంటూ లోకేష్ ట్వీట్ ..

ఈరోజు శ్రీరామనవమి సందర్భాంగా ప్రజలంతా శ్రీరాముడిని తలచుకుంటూ ..శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొంటున్నారు. మరోపక్క శ్రీరామనవమి సందర్భాంగా సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు సోషల్ మీడియా ద్వారా విషెష్ అందజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం నేత నారా లోకేష్..ఏపీలో రామరాజ్యాన్ని తెచ్చుకుందాం..అయోధ్యలా మార్చుదాం అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

పాలకుడికి అహంకారం ఉంటే రాజ్యం ఎలా దహించుకు పోతుందో చెప్పడానికి ఆనాటి లంక ఉదాహరణ. అలాగే పాలకులకి ముందుచూపు లేకపోతే ఆ రాజ్యంలో రావణ కాష్టం ఎప్పుడైనా రగులుకోవచ్చని అని చెప్పడానికి నేటి లంక ఉదాహరణ. ఏపీని లంకలా కానివ్వకుండా అయోద్యలా చూసుకుందాం. రామరాజ్యాన్ని తిరిగి తెచ్చుకుందాం. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు” అని జగన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశించి నారా లోకేష్ ట్వీట్ చేసారు. అంతకు మందు ట్వీట్‌ లో “గల్లీ నుండి ఢిల్లీ వరకూ పనికిమాలినోడని తేలిపోయిన తరువాత ఫ్రస్టేషన్ కాకపోతే ఫన్ వస్తుందా? వెంట్రుక మహరాజ్.. ఈకల ఎంపరర్ సీఎం జగన్‌ గారూ మీ వెంట్రుకలు పీకే ఓపిక, తీరిక మాకు లేవు. మీ నవరంధ్ర పాలన నుంచి ప్రజలను ఎలా గట్టెక్కించాలనే ఆలోచనలతో మేము పనిచేస్తున్నాం” అంటూ ట్వీట్ చేసారు.