అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లిన నారా లోకేశ్

అచ్చెన్నాయుడు భార్య, కుమారులను పరామర్శించిన లోకేశ్

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయడు ఇంటికి చేరుకున్నారు. పార్టీ సీనియర్లతో మాట్లాడి అచ్చెన్నాయుడు అరెస్ట్ తీరును అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు సతీమణి మాధవి, ఆయన కుమారులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. కాగా అనారోగ్యం నేపథ్యంలో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలోనే సీఐడీ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. మరోవైపు, ఆసుపత్రిలో ఉన్న ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/