జగన్‌ మీడియాపై లోకేష్‌ అగ్రహం

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ మీడియా సంస్థలు తనపై కక్ష కట్టాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా తాను మంగళగిరి ఎన్‌ఎస్‌ఎస్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని.. అయితే గుంటూరు టిడిపి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడినట్లు పేర్కొంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించి అవాస్తవ ప్రచారాన్ని జగన్‌ మీడియాలో బ్రేకింగ్‌ న్యూస్‌గా‌ వేశారని ఆరోపించారు. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమంలో ఓ మహిళా కార్యకర్త మాట్లాడిన మాటలను తనకు ఆపాదించి టిడిపి నేతలు, కార్యకర్తలపై లోకేశ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రసారం చేయడంలో జగన్‌ మీడియా ఆంతర్యమేంటని ప్రశ్నించారు. తమ పాలిట కార్యకర్తలే దేవుళ్లని.. వారిని పార్టీ నుంచి దూరం చేయాలనే కుట్రతోనే జగన్‌ మీడియా ఇలాంటి ప్రసారాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే టిడిపి బలమని.. జగన్‌ మీడియా ఎన్ని కుట్రలు చేసినా వారిని పార్టీ నుంచి దూరం చేయలేరని లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/