ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీ నోటా ఇదే వినిపిస్తోంది : లోకేశ్

జగన్ పాలన అధ్వానంగా ఉందని వెంకాయమ్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారన్న లోకేశ్

అమరావతి : జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదు కోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైస్సార్సీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు.

వెంకాయ‌మ్మ‌కి గానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల‌కి గానీ ఎటువంటి హాని త‌ల‌పెట్టినా తీవ్ర‌ ప‌రిణామాలు త‌ప్ప‌వని హెచ్చరించారు. మీ ద‌గ్గ‌ర వున్న‌ది కిరాయి మూక‌లని… తమ ద‌గ్గ‌ర ఉన్న‌ది పార్టీ అంటే ప్రాణం పెట్టే ల‌క్ష‌లాది మంది సైనికులని చెప్పారు. నిర‌క్ష‌రాస్య‌, నిరుపేద, ద‌ళిత మ‌హిళ‌ వెంకాయ‌మ్మ మాటే ఏపీలో ప్ర‌తీ ఇంటా, ప్ర‌తీ నోటా వినిపిస్తోందని… ఈ ఐదు కోట్ల‌ మంది పైనా దాడి చేయిస్తారా జ‌గ‌న్‌రెడ్డి గారు? అని లోకేశ్ ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/