మోదీ గుజరాత్‌ వెళ్లే టైం దగ్గరపడింది

nara lokesh
nara lokesh

అమరావతి: ప్రధాని మోదీ గుజరాత్‌ వెళ్లే టైం దగ్గరపడిందని మంత్రి నారా లోకేష్‌ అన్నారు. ‘‘జగన్ జైలు పక్షి. వైసీపీ అభ్యర్థి రామకృష్ణ కోర్టు పక్షి.’’ అని విమర్శించారు. ఉండవల్లిలో ఎన్నికల ప్రచారంలో లోకేష్‌ మాట్లాడారు. తనను ఓడించేందుకు కేసీఆర్ మంగళగిరికి రూ.200 కోట్లు పంపారని లోకేష్‌ ఆరోపించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ మేనిఫెస్టోలో అమరావతి ప్రస్తావన లేదన్నారు. మన రాష్ట్ర తాళాలు దొంగకి ఇస్తామా? అని ప్రశ్నించారు.