ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పోరాడేందుకు సిద్దమవుతున్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని ప్రకటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు గురువారం పల్నాడు లో లోకేష్ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్​.. రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని తాను వ్యక్తిగతంగా చదివిస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారు. ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేష్ ప్రకటించారు. తన కార్యక్రమం పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారని​.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తన కార్యక్రమం 9గంటలు ఆలస్యమైనా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికారు.. జగన్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో దీనిబట్టే తెలుస్తోందన్నారు.

Sudheer

Recent Posts

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేషన్ కు కేటీఆర్ హాజరు

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రేపు సోమవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు త‌న నామినేష‌న్‌ను…

7 hours ago

ఈ నెల 28 న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫలితాల ప్రకటన వచ్చేసింది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు…

7 hours ago

ఇస్మార్ట్ శంకర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా..?

ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ హీరో రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడా..? అదికుడా ప్రేమ వివాహమా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో…

9 hours ago

రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ…

10 hours ago

మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతాం అంటున్న టిఆర్ఎస్ నేతలు

trs mla vivekananda comments to modi hyderabad tour బిజెపి పార్టీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఫై పూర్తి ఫోకస్…

10 hours ago

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన టీ కాంగ్రెస్

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు , రాస్తారోకో లు చేస్తున్నప్పటికీ…

10 hours ago