సీఎం జగన్ కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

దారి మళ్లించిన రూ. 1,309 కోట్లను వెంటనే పంచాయతీల ఖాతాలలో జమ చేయాలి: నారా లోకేశ్

అమరావతి: టీడీపీ నేత నారా లోకేశ్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ. 1,309 కోట్లను తక్షణమే పంచాయతీల ఖాతాలలో జమచేయాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. గ్రామాలలో రోడ్లు, డ్రైన్లు, త్రాగునీరు, శానిటేషన్, లైటింగ్ పనుల కోసం గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులను దారిదోపిడీదారుల్లా తరలించుకుపోవడం దారుణమని అన్నారు.

మీరు రాష్ట్రానికి ఎలా ముఖ్యమంత్రో, గ్రామానికి సర్పంచ్ కూడా అంతేనని చెప్పారు. సర్పంచులను ఆటబొమ్మలను చేసి పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేసే రాజ్యాంగేతర చర్యలను మానుకోవాలని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/