రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులుగా మన బాధ్యత

అమరావతి: 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భారత దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నడిపే వారికి అధికారం అన్నది రాజ్యాంగం ప్రసాదించిన భిక్ష అని అన్నారు. అది మరచి ఆకాశం నుంచి దిగొచ్చినట్టు విర్రవీగుతూ… స్వార్థం కోసం తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే… వారికి సరైన గుణపాఠం చెప్పే శక్తిని కూడా ప్రజలకు ఇదే రాజ్యాంగం ఇచ్చిందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతల దార్శనికత అలాంటిదని, రాజ్యాంగ పరిరక్షణ భారత పౌరులుగా మన బాధ్యతని అన్నారు. ఆ బాధ్యతను సదా నిర్వహిస్తూ… ప్రజాస్వామ్యానికి అండగా ఉండేందుకు మనందరం కృషి చేద్దామని లోకేష్ పిలుపిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/