విజయవంతంగా ముగిసిన లోకేష్‌ దావోస్‌ పర్యటన

Nara Lokesh, HPE Chief Statragy Officer, Vishal Lall, Davos
Nara Lokesh, HPE Chief Statragy Officer, Vishal Lall, Davos

ఈనెల 21న దావోస్‌ పర్యటనకు వెళ్లిన ఎపి మంత్రి లోకేష్‌ బృందం 22 నుండి 24వరకు జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ హెచ్పీఈ కంపెనీ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విశాల్‌ లాల్‌తో మంత్రి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న యువతీ యువకులు ఉన్నారని, ఐటీ రంగం అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రపంచంలో ప్రముఖ కంపెనీలైన డెలాయిట్‌, ప్రోక్టర్‌ అండ్‌ గేంబల్‌, విప్రో, పెగా సిస్టమ్స్‌, అర్సెలార్‌మిట్టల్‌, నెస్లే, ఏటీ అండ్‌ టీ, ఇన్వెస్కోతోపాటు పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పెట్టుబడులకు ఎపి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, రాయితీలు, కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ ఎపి లో పెట్టుబుడులు పెట్టడానికి ఆహ్వానించారు. మంత్రి లోకేశ్‌ బృందం దావోస్‌ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మంత్రి లోకేశ్‌ ఈ నెల 28న తేదీని ఎపి కు రానున్నట్లు సమాచారం.