అమెరికాలో వైస్సార్సీపీ మంత్రికి..నారా లోకేష్ ఫ్రెండ్ స్వాగతం..?

తానా ఆహ్వానం మేరకు అమెరికా కు వెళ్లిన వైస్సార్సీపీ మంత్రి తానేటి వనిత కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్నేహితుడు ఆహ్వానం పలికారంటూ సోషల్ మీడియాలో ఫోటో ఒకటి వైరల్ గా మారింది.

TANA సభ్యుల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన హోమ్ మినిస్టర్ తానేటి వనిత గారిని అమెరికాలో రిసీవ్ చేసుకున్న లోకేష్ ఫ్రెండ్..అంటూ రెండు ఫోటోలను జతరపరిచి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారు. మంత్రి వనితకు స్వాగతం పలికిన వ్యక్తి లోకేష్ ఫ్రెండ్ అని.. గతంలో లోకేష్ వెళ్లిన సమయంలో కూడా అదే వ్యక్తి స్వాగతం పలికారని ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే లోకేష్ స్నేహితుడా..? లేదా..? కావాలంటే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఆలా ప్రచారం చేస్తున్నారా ..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ పర్యటనలో మంత్రి వనిత సరదాగా గన్ షూటింగ్‌కు వెళ్లారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.