రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతా?

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: రైతులు ఆనందంగా ఉండాల్సిన చోట పోలీసు కవాతు నిర్వహిస్తారా? అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ద్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఒక్కో గ్రామానికి వెయ్యిమంది పోలీసులను దింపి ఉద్యమాన్ని అణచివేయాలని అనుకోవడం ముఖ్యమంత్రి జగన్‌ అవివేకమన్నారు. గ్రామస్థులను ఇళ్లలో బందిస్తారా? అని వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంత ఘోరం మరొకటి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో యుద్ధ వాతావరణం తీసుకొచ్చినందుకు వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వం భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్‌ హెచ్చరించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/