రైతులను ఎండలో కూర్చో బెట్టిన పాపం ఊరికే పోదు

గ్రామాల్లో గుడికి తాళం వేసే దుస్థితికి వచ్చిదంటే రాష్ట్రంలో పరిపాలన ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: రైతులను నడి రోడ్డుపై ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విమర్శలు చేశారు. వైఎస్సాఆర్‌సిపి ప్రభుత్వానికి పాడె కట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారని అన్నారు. గ్రామాల్లో గుడికి తాళం వేసే దుస్థితికి వచ్చిందంటే రాష్ట్రంలో ఎంతో ఘోరమైన పరిపాలన సాగుతుందో అర్ధమవుతుందని నారా లోకేష్‌ దుయ్యబట్టారు. ఇంకా రాజధాని గ్రామాల్లో వేల సంఖ్యలో పోలీసులతో కవాతు చేయించి ప్రజల గొంతు నొక్కడం సాధ్యంకాదని అన్నారు. టెంటు పీకేసినంత మాత్రాన ఉద్యమం ఆగిపోదని లోకేష్‌ హెచ్చరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ గారి నిరంకుశత్వ పాలనకి రాజధానిలో ఉన్న పరిస్థితులే నిదర్శనమన్నారు. సీఎం జగన్‌ గారు మీరు ఎంత ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/