ఉత్తరాంధ్ర అన్నప్పుడే అనుమానం వచ్చింది

విశాఖలో భూ కబ్జాలు, ల్యాండ్‌ మాఫియా వంటి చర్యలతో మరింత స్పష్టత

nara lokesh
nara lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై టిడిపి నేత నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. అభివృద్ధి, ప్రణాళిక లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి అని సీఎం అన్నప్పుడే అనుమానం వచ్చిందని నారా లోకేష్‌ అన్నారు. కార్యాలయాలు అటు, ఇటు మార్చడం ద్వారా ఉత్తరాంధ్ర వెలిగిపోతుందని అన్నప్పుడే నా అనుమానం మరింత బలపడిందని నారా లోకేష్‌ అన్నారు. ఉత్తరాంధ్రపై జగన్‌మోహన్‌ రెడ్డి దండయాత్ర ప్రారంభమైందని దుయ్యబట్టారు. విశాఖపట్టణంలో జరగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్‌ మాఫియా వీరంగం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారాలు చూస్తుంటే సీఎం దండయాత్ర విషయంలో స్పష్టత వచ్చిందని లోకేష్‌ విమర్శించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/