మీకు ఆ సోదరి ఆక్రోశం వినిపిస్తోందా

ఆ దళిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలి..లోకేశ్‌

nara lokesh
nara lokesh

అమరావతి: టిడిపి నేత నారా లోకేశ్‌ జగన్‌ పై విమర్శలు గుప్పించారు. మాస్క్ పెట్టుకోలేదంటూ పోలీసులు జరిపిన దాడిలో కిరణ్ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జరిగిన నిరసన కార్యక్రమంలో కిరణ్ సోదరి ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియోపై లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘మీ పాలనా క్రూరత్వానికి సోదరుడిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తోందా జగన్ గారు? చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా? కేసును నీరుగార్చాలని చూస్తే సహించం. ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలి. ఆ దళిత కుటుంబానికి న్యాయం జ‌ర‌గాలి’ అని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/