ఏపీ మంత్రులపై నారా లోకేష్‌ ధ్వజం

పేదల భూములు లాక్కుంటున్నారంటూ ఆగ్రహం

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రులపై టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌గారు సైలెంట్‌గా విశాఖ భూములు కాజేస్తే మేము ఏమైనా తక్కువ తిన్నామా అంటున్నారు వైఎస్‌ఆర్‌సిపి మంత్రులని నారా లోకేష్‌ విమర్శించారు. మంత్రులు ఒక అడుగు ముందుకేసి వైలెంట్‌గా పేద ప్రజల భూములు లాక్కుటున్నారని ఆయన దుయ్యబట్టారు. మొన్న బొత్స, నిన్న ఆది మూలపు కుటుంబసభ్యులే నేరుగా ప్రజలపై పడి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కనీసం మహిళలు అని కూడా చూడకుండా వారి కష్టార్జితాన్ని లాక్కొని రోడ్డు మీద నిలబెడుతున్నారని, వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు, ప్రజా ప్రతినిధుల భూ దాహానికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని నారా లోకేష్‌ దుయ్యబట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/