ఏపీని గాడిలో పెట్టాలంటే ఎంతకాలం పడుతుందో : లోకేశ్

ఆ బ్రిడ్జి కేసు లాగానే.. సీఎం జగన్ కూడా పిచ్చి, అరాచకంతో భవిష్యత్ ను లాగేసుకుంటున్నారు..లోకేశ్

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బీహార్ లో 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని దోచేసిన ఘటనతో ఏపీ ప్రభుత్వాన్ని పోల్చారు. బీహార్ లోని ఆరా సోనె కెనాల్ మీద బీహార్ ప్రభుత్వం నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని దొంగలు మొత్తం విప్పేసి దోచుకెళ్లిపోయారు. దానికి సంబంధించిన వార్తను పేపర్ కటింగ్ తో పోస్ట్ చేసి, సీఎం జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు.

ఆ స్టీల్ బ్రిడ్జి దొంగతనం లాగానే సీఎం జగన్ కూడా తన పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసమర్థతతో రాబోయే తరాల భవిష్యత్ ను దొంగిలించేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఇంకెంత కాలం పడుతుందో ఊహించుకోవడం కష్టమని ఆయన విమర్శలు గుప్పించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/